నవతెలంగాణ – జన్నారం
ఈనెల 29, 30 తేదీలలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జన్నారం మండల కార్యదర్శి కనికారం అశోక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేదే సీపీఐ(ఎం) పార్టీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభలో ఎండ కట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామన్నారు. మందమరిలో నిర్వహించే ఆ సభను సీపీఐ(ఎం) పార్టీ శ్రేయోభిలాషులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కూకటికారి బుచ్చయ్య కొండ గొర్ల లింగన్న గుడ్ల రాజన్న, దాసంల రాజన్న, రాజమౌళి, అంబటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.