సీపీఐ(ఎం) జిల్లా మహాసభను జయప్రదం చేయండి..

Make CPI(M) District Mahasabha Jayapradham..– సీపీఐ(ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు..
– మాటూరి బాలరాజ్ గౌడ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 డిసెంబర్ 15, 16, 17 తేదీలలో చౌటుప్పల్ లో జరిగే సీపీఐ(ఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం  మండల పరిధిలోని నమాతుపల్లి గ్రామంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించి,  మాట్లాడారు.  డిసెంబరు 15, 16, 17 తేదీలలో చౌటుప్పల్ లో జిల్లా మూడో మహాసభలో జరుగుతున్నాయని 15వ తేదీన సీపీఐ(ఎం జన జాతర బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు కేంద్ర రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా ఆవిర్భవించి 8 సంవత్సరాలైనా అనేక ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని దశాబ్దాలుగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నావని వ్యవసాయమే జీవనాధారమైన చిన్న, సన్న కారు, మధ్యతరగతి రైతంగం సరైన నీటి వసతి లేక సతమతమవుతున్నారని నీళ్లు లేక వందల ఎకరాల భూములు బీళ్లుగా మారిపోయాయని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం, గంధ మల్ల రిజర్వాయర్ పనులు నత్తనడకలో ఉన్నావని ఈ ప్రాజెక్టులకు సరిపడ నిధులు విడుదల చేయడంలో పాలకులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా చిన్న నీటి వనరులకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పనులు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కేంద్ర ఆస్పత్రి తో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లలో అలాగే విద్యారంగం బలహీనంగా ఉందని ఇప్పటివరకు ప్రభుత్వ డిగ్రీ ,పీజీ కాలేజీలు లేవని వెంటనే ప్రభుత్వ కాలేజీలో నెలకొల్పాలని వారన్నారు. టిఆర్ఎస్ పాలన వైఫల్యం  ఆ ప్రజాస్వామ విధానాలతో విధానాలతో విసిగిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టం కట్టారు 6 గ్యారంటీ ల పేరుతో ప్రజల ఆకర్షించే అధికారం చేపట్టిన కాంగ్రెస్ హామీల అమలుపట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని రాజకీయ విలువలకు తిలోదాకాలిచ్చి అసభ్యంగా నేతలలో మాట్లాడుకుంటున మీరు అభ్యంతరంగ ఉందని వారన్నారు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ 15, 16 ,17 తేదీలలో చౌటుప్పల్ కేంద్రంలో జరుగుతున్నాయని 15వ తేదీన గొప్ప బహిరంగ సభ ఉంటుందని బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు ప్రజలను కోరారు. ఈ మహాసభలో గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు జరిగిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిస్తామని వారు తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు సిర్పంగి ప్రకాష్, ఐతరాజు కిష్టయ్య, ముత్యం ప్రకాష్, యాదగిరి, జిట్టా అండాలు, జిట్టా లలిత ,జిట్ట చంద్రకళ లు పాల్గొన్నారు.