నవతెలంగాణ – మల్హర్ రావు
సీపీఐ(ఎం) మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) నాయకులు,ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) 3వ జిల్లా మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్టిపిసిలో ఈనెల 23 23 24 తేదీలలో సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకత్వం హాజరకావడంతోపాటు,జిల్లా నలుమూలల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. మొదటి రోజున సాయంత్రం నాలుగు గంటలకు వేలాది మందితో ప్రదర్శన భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నామన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు ,మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తీర్మానాలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలు జయప్రదానికై మంథని నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజానికం హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బూడిద గణేష్, ఆర్ల సందీప్, గోరెంకల సురేష్ బావు రవి, కృష్ణ, మల్లేష్, కుమార్ పాల్గొన్నారు.