ఈనెల 26, 27 న జరిగే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా పార్టీ కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈనెల 26 27న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియల్ లో నిర్వహించటం జరుగుతుందని, 26న బహిరంగ సభ ఉంటుందని ఈ మహాసభలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, పాలడుగు భాస్కర్, జ్యోతి, హాజరవుతున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాల కాలంలో జిల్లాలో జరిగిన ఉద్యమ సమీక్షను చేసుకొని 53 సంవత్సరాల కు భవిష్యత్ కార్యాచరణను ఇప్పుడు నుంచి కోవటం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపటంలో వైఫల్యం చెందాయని సందర్భాల్లో ఉద్యోగ కార్మిక ప్రజా సమస్యల పైన ఉద్యమాలను నిర్వహించటంతో పాటు జిల్లా సమస్యల పైన పోరాటాలు నిర్వహించటం జరిగిందని, అయినప్పటికీ ఇంకా అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు సరిగా స్పందించనందున రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అందుకు ప్రజలు సహకరించాలని ఆయన తెలిపారు. 26న జరిగే సభకు జిల్లాలోని కార్మిక కర్షక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రతి వెంకట్ రాములు నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.