నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మాదాపూర్ గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ శుక్రవారం మాట్లాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయనీ, ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాలుగా చేసిన పనిని సమక్షించి రాబోయే మూడు సంవత్సరాలకి భవిష్యత్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందనీ అన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం పేదలకి డబుల్ బెడ్రూం గానీ రైతులకి రైతుబంధు, రైతు బీమా అట్లాగే వృద్ధులకి, వికలాంగులకు, వితంతువులకి పెన్షన్ పెంచుతమన్న పెన్షన్ విషయంలో ఈ అంశాల పైన రాజీలేని పోరాట నిర్వహిస్తామని తెలిపారు. సీపీఐ(ఎం) ప్రజల పక్షాన నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తుందని తెలియజేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు జరుగుతున్నందున రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీకి ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. రైతులు, కార్మికులు, ప్రజలు, మేధావులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల.కార్యదర్శి కొండ గంగాధర్, కంది ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.