జిల్లా సదస్సును జయప్రదం చేయండి

– ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి.
నవతెలంగాణ – మాక్లూర్ 
రైతన్నల సమస్యల పరిష్కారం కొరకై ఫిబ్రవరి 13న నిజాంబాద్ ప్రేస్ క్లబ్ లో జిల్లా సదస్సును జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని బోర్గం (కే) గ్రామంలో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలోనే సహకార రంగంలో నడిచే సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపిస్తామని తమ ఎన్నికల ప్రచారంలో తెలిపారన్నారు. కావున ఈ ఫ్యాక్టరీ వల్ల వందల మందికి ఉపాధి దొరుకుతుందని, అలాగే రైతులు చెరుకు పండించడానికి సుముఖంగా ఉన్నారని, రైతు సమస్యలు పరిష్కారం కొరకై ఈ నెల 13న నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సును 1. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం 2.అఖిల భారత రైతు కూలీ సంఘం 3. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ తుల రాజేందర్, ప్రొఫెసర్ జి, సదానందం లు హాజరవుతున్నారన్నారు. కావున 13న జరిగే జిల్లా సదస్సును జిల్లా రైతులు కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయగలరని కోరుతున్నమన్నారు.