డి.ఎస్.పి ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 

ఈనెల 12న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే ధర్మసమాజ్ పార్టీ ఆవిర్భవ సభను విజయవంతం చేయాలని జిల్లా డిఎస్ పి ఉపాధ్యక్షుడు బోయిన సదన్ మహరాజ్ కోరారు. బుధవారం విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ  ధర్మ సమాజ్ పార్టీ ప్రథమ జిల్లా ఆవిర్భావ సభకి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ విశారదన్ మహరాజ్ హాజరవుతారని తెలిపారు. జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ, సభ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. సభకు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, విద్యార్థులు, యువకులు, ప్రజాస్వామ్యవాదులు, అగ్రకుల పేదలు, భారత రాజ్యాంగ ప్రేమికులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై  సభను జయప్రదం చేయలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల కమిటీ నాయకులు చెంచల ఎల్లన్న, భిక్ష మహారాజ్ పాల్గొన్నారు.