
ఐసిడిఎస్ కు, మధ్యాహ్న భోజన పథకం కు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించి అంగన్వాడి టీచర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులు కు కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, గ్రాట్యుటీ చట్టం అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా పిట్టల అర్జున్ కోరారు. ఈ సందర్భంగా బుధవారం ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నాగ దుర్గ అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన పథకం యూనియన్ సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ బ్యాంకు ల్లో వేలకోట్ల తీసుకుని తిరిగి చెల్లించని తెగ బలసిన పారిశ్రామిక వేత్తలకు మోడీ తిరిగి లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారు అని, ఆ లోటు పూడ్చడానికి పేదల కు ఇస్తున్న సబ్సిడీలను, ప్రభుత్వ రంగ సంస్థలు ను కారు చౌకగా అమ్మి వేస్తున్నారు అని అన్నారు. ఫిబ్రవరి 16 న జరిగే దేశవ్యాప్త సమ్మె మోడీ మెడలు వంచేందుకే నని, స్కీం వర్కర్లు అందరూ పాల్గొని సమ్మె ను జయప్రదం చేయాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు నారాయణపురం, గుమ్మడివల్లి, వినాయకపురం సెక్టార్ సూపర్వైజర్ కు సమ్మె నోటీసులు అందజేశారు. మధ్యాహ్న భోజనం కార్మికులు యంఈవో కార్యాలయంలో మహబూబ్ కు సమ్మె నోటీసు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నన్నీ, యామిని, సీత, చిలకమ్మ, వెంకమ్మ, కృష్ణ వేణి, సామ్రాజ్యం, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.