మత్స్యకారుల సదస్సును విజయవంతం చేయాలి 

– ముదిరాజ్ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కుమారస్వామి 
నవతెలంగాణ-బెజ్జంకి 
మానకొండూర్ మండల కేంద్రంలోని పంక్షన్ హాల్ యందు ఈ నెల 13న నిర్వహించనున్న మత్స్యకారుల చైతన్య సదస్సును విజయవంతం చేయాలని మత్స్యకారుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పెసరు కుమారస్వామి కోరారు.సోమవారం మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయ అవరణం వద్ద ముధిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య అధ్వర్యంలో నిర్వహించిన ముధిరాజ్ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.మండలంలోని అయా గ్రామాల మూధిరాజ్ సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో హజరై చైతన్య సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ముధిరాజ్ సంఘ నాయకులు హజరయ్యారు.