నవతెలంగాణ -ఆర్మూర్
సెప్టెంబర్ 1 నిర్వహించేటటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని డి టి ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు బాలయ్య ,రాజన్న లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు యు.ఎస్.పి.సి భాగస్వామ్య సంఘాలు పెండింగ్ సమస్యలు బదిలీలు పదోన్నతులు చేపట్టాలని పి ఆర్ సి కమిటీని వెంటనే వేయాలీ , ఐ ఆర్ ప్రకటించాలని, అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 1న నిర్వహించేటటువంటి మహా ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని డిటిఎఫ్ పక్షాన కోరినారు..