ఈ నెల 27, 28 తేదీల్లో కరీంనగర్ నుంచి వేములవాడ వరకు నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు నందగిరి రజినీకాంత్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మహా పాదయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర ఎనలేనిది అని తెలిపారు. కష్ట నష్టాలకు ఓర్చి కేసుల పాలై ఆర్థికంగాను మానసికంగాను నష్టపోయిన ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని బాధపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, మహిళ అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి పిలుపుమేరకు పాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, యువకులు, మేధావులు తరలిరావాలని కోరారు.
ఉద్యమకారుల కుటుంబాలకు పరామర్శ
మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కర్ర రవీందర్ రెడ్డి కుమారుడు కరుణాకర్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. తదుపరి తెలంగాణ ఉద్యమకారుడు పోలినేని శ్యాంసుందర్ రావు ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి వారి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అధికార ప్రతినిధి నర్మెట యాదగిరి, జిల్లా కార్యదర్శి అల్లి యాదగిరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వంటల మల్లక్క, జిల్లా ఉపాధ్యక్షుడు సుదగాని వెంకటేశ్వర్లు, వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్,రాయపర్తి మండల అధ్యక్షుడు శ్యాం సుందర్, నెక్కొండ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మండల నాయకులు నాగండ్ల భాస్కర్, మహ్మద్ గుంశా వాలి , ఉడుగుల వెంకన్న, మహ్మద్ నాయిమ్, మందాటి సుదర్శన్ రెడ్డి, రావుల భాస్కర్ రావు, రాజిరెడ్డి, మంద యకన్న, మునవత్ సేవిలాల్, లక్ష్మీన్, శ్రీను, అబ్బోజు రామ్మోహన్ చారి, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.