నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాదులోని గాంధీభవన్ సమీపంలో ప్రకాశం హాల్లో నిర్వహించే దివ్యాంగుల ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం బాలస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. డిసెంబర్ ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు, దివ్యాంగ ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.