ఎమ్మార్పీఎస్ రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి

Make the MMRPS state level conference a successనవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్ర స్థాయి సదస్సు ను జయప్రదం చేయాలనీ తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు జిల్లా ఇంచార్జ్ పడిదల రవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికంటి అంబేద్కర్లు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక పబ్లిక్ క్లబ్ లో జరిగిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమేశం లో వారు మాట్లాడుతు జులై రేపు యాదాద్రి లక్కీ ఫంక్షన్ హల్ లో జరిగే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర స్థాయి సదస్సు కు జిల్లా నలు మూలల నుండి మాదిగ లు మాదిగ ఉపకులాల నుండి అధిక సంఖ్య లో పాల్గొని సదస్సు ను జయప్రదం చేయాలనీ అన్నారు. అలాగే బీజేపీ మాదిగలకు చేసిన ద్రోహం అంత ఇంత కాదని మన ఓట్ల తో గెలిచి మన మీదే పెత్తనం చేలా ఇస్తున్నారని మాదిగలను విభజించి పబ్బం గడుపు తున్నారని అన్నారు. ప్రభుత్వం రాక ముందు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట తప్పిన బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలని మాదిగ లు మాదిగ ఉపాకులా లు ఐక్యంగా పోరాటం చెయ్యాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుక జానయ్య గౌరవ అధ్యక్షులు  దుబ్బ రమేష్ చింత సైదులు నాగరాజు భరత్ రాజేష్  వినోద్ కందుల పవన్ మహేందర్ తమన్ ప్రవీణ్ పర్షి చింటూ నాని తదితరులు పాల్గొన్నారు.