మూసి ప్రక్షాళనపై జరిగే ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయండి

– మండల కాంగ్రెస్ నాయకులు చురుకంటి చంద్రారెడ్డి
నవతెలంగాణ నూతనకల్: తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి ప్రక్షాళన, పునర్జీవనంపై జరిగే ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చురుకంటి చంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలు పిలుపునిచ్చారు. నేడు  అడ్డగూడూర్ మండల పరిధిలోని  మానాయికుoట-మూసి బ్రిడ్జి పై  జరుగే నియోజకవర్గస్థాయి బహిరంగ సభకు  భువనగిరి  పార్లమెంటు సభ్యులు  చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ,నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు వేముల వీరేశం, భువనగిరి నియోజకవర్గ శాసనసభ సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరయ్యే ఈ సభకి మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.