ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

నవ తెలంగాణ- మల్హర్ రావు:  ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ నెల 7న మంథనిలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌లు పిలుపునిచ్చారు. గురువారం మంథనిలో నిర్వహించే సీఎం ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ మేము మా కుటుంబం, బీఆర్‌ఎస్‌ పార్టీ అనే నినాదంతో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు సీఎం సభకు తరలిరావాలన్నారు. బీసీ బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసే విధంగా బారీ తరలిరావాలని వారు అన్నారు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేవలం ఓట్ల కోసం మాత్రమే ప్రజల వద్దకు వస్తారని, ప్రజల శ్రేయస్సు కోసం ఏనాడు ఆలోచన చేయలేదనే సందేశానని చాటిచెప్నాలన్నారు. 07న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడంతో పాటు ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆశీర్వాదం అందించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.