ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

 

– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండల మల్లయ్య

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 24 శుక్రవారం రోజున జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య కోరారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ములుగు పట్టణంలో జరిగే కెసిఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ సమస్యకృతతో పనిచేసి ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ 8 రోజులు కష్టపడితే ఐదేళ్లలో మనం ఎంతో అభివృద్ధిని చూడొచ్చు అన్నారు. ములుగులో జరుగు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు విద్యార్థులు, మేధావులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బంగారు సాంబయ్య, యూత్ అధ్యక్షులు డేగల సలేందర్,  బండారు అనీల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.