‘నేడు కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి’

నవతెలంగాణ-పరిగి
సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిని విజ యవంతం చేయండి అని సీపీఐ పరిగి నియోజకవర్గ కార్యదర్శి పీర్‌మహమ్మద్‌ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..రైతులు పండిం చిన పంటకు గిట్టుబాటు ధర కావాలని, ప్రభుత్వం తీసుకొ చ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టా లను రద్దు చేయాలని రైతులు పోరా టాలు చేస్తున్నా రన్నారు. పోరాటం చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపతే ఒక రైతు చనిపోయాడని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద, హక్కులకు నిలదీసే వారిని అణచివేస్తుందన్నారు. కార్పొ రేట్‌ శక్తులకు దేశ సంపదను దోచి పెట్టేందుకు ఎంతకైనా తెగిస్తుంద న్నారు. ప్రజాస్వా మ్యవాదులంతా, ఏకతాటిపై వచ్చి ఐక్యంగా పోరాటాలు చేస్తున్న సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలు పుమేరకు నేడు ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘా లు, పాల్గొనాలని విజయ వంతం చేయాలని కోరారు.