రిటైర్డ్ ఉద్యోగులధర్నా ను విజయవంతం చేయండి

Make the sit-in of retired employees a successనవతెలంగాణ – కంఠేశ్వర్ 

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల19వ తేదీ ఉదయం 11 నూతన కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ..ముఖ్యంగా పెండింగులో ఉన్న నాలుగు డిఏలు విడుదల చేయాలని, నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించాలని, పి ఆర్ సినీ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, కమిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, వెల్నెస్ సెంటర్ నందు స్పెషలిస్ట్ డాక్టర్లు ను నియమించాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు ,డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, కార్యదర్శి ప్రసాద్ రావు . గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయరావు, జిల్లా నాయకులు బాబా గౌడ్, లావు వీరయ్య, భోజారావు రాధాకృష్ణ తదితరులు తెలిపారు.