ఖమ్మంలో యూనిటీ మహాసభలను విజయవంతం చేయండి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జాక్రన్ పల్లి మండలంలో గల ఇందిరా నగర్ కాలనీ  వాసులతో సీపీఎంఎల్ ప్రజా పంథా మాస్ లైన్ పార్టీ జనరల్ బాడీ సమావేశం సబ్ డివిజన్ కార్యదర్శి బట్టు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి  జిల్లా కార్యదర్శి వి ,ప్రభాకర్ , ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి, దేవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంతో కలిసి సమాజం లో జరుగుతున్న అనసమనతలను, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలని, సమస్యలపై ఐక్యమత్యంగా కలిసి పోరాడాలని వారు తెలియజేశారు. మన పార్టీ విది విధానాలు నచ్చి మన లైన్ లోకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిపిఎంఎల్ పార్టీలు ,మనతో కలిసి రావాలనుకున్నాయని అందుకే సీపీఐఎంఎల్ ప్రజాపంథా, సీపీఐఎంఎల్ RI సీపీఐ ఎంఎల్ పీసీసీసPCC పార్టీలు ఒకటిగా ఏర్పడి సిపిఎంఎల్ ప్రజా పంథా మాస్ లైన్ గా అవతరిస్తున్నయని ఈ విలీన మహాసభలు ఖమ్మం వేదికగా 3,4,5 మూడు నాలుగు ఐదు తేదీలలో జరుగుతున్నాయని 3 మూడవ తేదీన భారీ బహిరంగ సభ, ర్యాలీ ఉంటుందని ఇ కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు తలారి గంగాధర్, అనిల్ కుమార్, నాయకులు నిఖిల్, శంకర్, మోహన్,ప్రభాకర్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.