విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయండి

– కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ చీకటి మహేష్ గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
విజయ సంకల్ప యాత్ర పార్లమెంటు ఎన్నికల్లో సంస్థ గత అంశాలపై మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమావేశాన్ని సోమవారం నిర్వహించినట్లు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ చీకటి మహేష్ గౌడ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బూతు అధ్యక్షులు శక్తి కేంద్రాలతో సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. ప్రతి ఒక్కరు కలిసి ఉండి కష్టసుఖాలు పాలుపంచుకోవాలని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ జిల్లా నాయకులు పాపారావు, ప్రభాకర్ రెడ్డి మండ ఉపాధ్యక్షులు యుగేందర్, రాజుల కొత్తపల్లి బూత్  అధ్యక్షులు మహేష్, రావిరాల  బూత్ అధ్యక్షులు సురేష్,  సాగర్ వావిలాల బూత్ అధ్యక్షులు రంజి,త్ శ్రీ రామగిరిబూత్ శీను పార్వతమ్మ, గూడెం  అధ్యక్షులు యాకన్న,  మదనతుర్తి భూత అధ్యక్షులు శీను,  యువమోర్చా ప్రధాన కార్యదర్శి శివ సాయి, తదితరులు పాల్గొన్నారు.