విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి

నవతెలంగాణ- నవీపేట్: హైదరాబాద్ లో ఆగస్టు రెండవ వారంలో నిర్వహించే మాదిగల విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగారపు మురళీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పలు డిమాండ్లతో మందకృష్ణ మాదిగ నిర్వహించి సభకు మాదిగలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానికొల్ల గంగాధర్ ఆకారం రమేష్, జీవన్, గొంటు పద్మ, నర్సింలు, సత్యనారాయణ, గంగామణి తదితరులు పాల్గొన్నారు.