విభిన్న రంగాల్లో త‌మ‌దైన ముద్ర‌

Make their mark in different fields2024… ఎన్నో ఆనందాలను.. కొన్ని చేదు జ్ఞాపకాలను మనకు మిగిల్చి వెళ్లిపోతోంది. మరి రెండు రోజుల్లో నూతన ఉత్సాహంతో మరో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాము. తమ శక్తిసామర్థ్యాలను నిరూపించున్న మహిళలు మన మధ్య ఎందరో ఉన్నారు. రాబోయే కొత్త ఏడాదికి మహిళా సాధికారతకు వారు చిహ్నంగా నిలిచారు. 2024 ఏడాదికి గాను హార్పర్స్‌ బజార్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఈవార్డు అందుకున్న వారి పరిచయాలు క్లుప్తంగా…
అవని లేఖరా, షూటింగ్‌
అవనీ లేఖరా షూటింగ్‌లో భారతదేశంలోనే పారాలింపిక్‌లో డబుల్‌ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్న మొదటి మహిళ. ఇన్పుడు ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పారా షూటింగ్‌ ప్రపంచ కప్‌, ప్రపంచ షూటింగ్‌ పారా స్పోర్ట్‌ ఛాంపియన్‌షిప్‌ల వంటి అంతర్జాతీయ పోటీలలో బహుళ పతకాలతో ఆమె విజయం పారాలింపిక్స్‌కు మించి విస్తరించింది. వీటితో పాటు 2021లో మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అందుకున్నారు. అలాగే భారతీయ క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలను గుర్తించి ప్రభుత్వం 2022లో పద్మశ్రీతో సత్కరించింది.
పాయల్‌ కపాడియా, దర్శకురాలు
స్క్రీన్‌ రైటర్‌ డైరెక్టర్‌గా పాయల్‌ కపాడియా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఆమె ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ చిత్రానికి కేన్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ గెలుచుకున్నారు. భారతదేశం నుండి దీన్ని గెలుచుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కపాడియా మొదటి పూర్తి నిడివి చిత్రం ఎ నైట్‌ ఆఫ్‌ నథింగ్‌ 2021లో విడుదలయ్యింది. ఇది 74వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీకి గోల్డెన్‌ ఐ అవార్డును గెలుచుకుంది. ఆమె తన వినూత్న కథనం, లోతైన సినిమా కళాత్మకతతో ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.
జోనితా గాంధీ, సంగీత కళాకారిణి
ఈమె బహుముఖ గాయకురాలు. అనేక భాషలలో తన మనోహరమైన స్వరంతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాలలో అనేక మంది లెజెండ్స్‌తో కలిసి పని చేశారు. ఆమె ఏ దిల్‌ హై ముష్కిల్‌లో ‘ది బ్రేకప్‌ సాంగ్‌’, కలంక్‌లో ‘ఘర్‌ మోర్‌ పర్దేశియా’, ‘వాట్‌ జుమ్కా’ వంటి ప్రసిద్ధ ప్లేబ్యాక్‌ హిట్‌లతో సంగీత పరిశ్రమలో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’తో సంగీత ప్రేమికుల మనసు దోచుకున్నారు.
నమ్రతా సోని, మేకప్‌ ఆర్టిస్ట్‌
ప్రసిద్ధ మేకప్‌ ఆర్టిస్ట్‌, బ్యూటీ ఎంటర్‌ప్రెన్యూర్‌ అయిన నమ్రతా సోని తన వినూత్న పద్ధతుల ద్వారా గొప్ప మేకప్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రూపాంతర కళాత్మకతకు ప్రసిద్ధి చెందారు. నమ్రతా 2020 నుండి శరీరానికి హాని చేయని సహజ సౌందర్య ఉత్పత్తులపై దృష్టి పెట్టారు. దీనికోసం సింప్లీ నామ్‌ను ప్రారంభించారు. అలాగే ఆమె తన సొంత బ్యూటీ అకాడమీ, మేకప్‌, హెయిర్‌ అకాడమీని కూడా ఏర్పాటు చేశారు.
అనితా డోంగ్రే, ఫ్యాషన్‌ డిజైనర్‌
భారతీయ ఫ్యాషన్‌లో దార్శనికురాలు అనితా డోంగ్రే. తన టైమ్‌లెస్‌ డిజైన్‌లతో గ్రామీణ కళాకారులను శక్తివంతం చేయడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నారు. ఒక్క డిజైనింగ్‌లోనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ ఓ శక్తివంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అలాగే మూగజీవాల సంక్షేమం కోసం తన వంతు సాయం చేస్తున్నారు.
అవనీ రాయ్‌, ఫోటోగ్రాఫర్‌, ఫిల్మ్‌ మేకర్‌
ఒక ప్రత్యేకమైన ఫోటోగ్రాఫర్‌, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత అవనీ రాయ్‌. భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ, కాశ్మీర్‌ కాన్ఫ్లిక్ట్‌, చెన్నై వాటర్‌ క్రైసిస్‌ వంటి ముఖ్యమైన సామాజిక సమస్యలపై తన పదునైన ఫొటో వ్యాసాల ద్వారా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. ఆమెది చెప్పుకోదగ్గ రచన రఘు రారు. యాన్‌ ఫ్రేమ్‌డ్‌ పోర్ట్రెయిట్‌తో చిత్రనిర్మాణంలోకి ప్రవేశించారు. ఆమె తన మేక్‌డాక్స్‌ (మాసిడోనియా)కు మోరల్‌ అప్రోచ్‌ అవార్డును గెలుచుకున్నారు. ఇది గత 50 ఏండ్లలో భారతదేశ చరిత్రతో ముడిపడి ఉన్న తన తండ్రి ఫొటోగ్రాఫిక్‌ ప్రయాణాన్ని వర్ణించే డాక్యుమెంటరీ.
కనికా గోయల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌
అవాంట్‌-గార్డ్‌ సెన్సిబిలిటీస్‌తో బోల్డ్‌ స్ట్రీట్‌వేర్‌ సౌందర్యాన్ని మిళితం చేయడంలో పేరుగాంచిన డిజైనర్‌ కనికా గోయల్‌. న్యూయార్క్‌, లండన్‌ ఫ్యాషన్‌ వీక్స్‌లలో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకోరు. ప్రపంచ సాంస్కృతిక ధోరణిలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కనిక తన ప్రత్యేకమైన డిజైన్‌ విధానాన్ని మెయిన్‌ స్ట్రీమ్‌ అప్పీల్‌తో విలీనం చేస్తూ ప్రముఖ గ్లోబల్‌ బ్రాండ్‌లతో కూడా భాగస్వామిగా ఉన్నారు.
అనన్య పాండే, యాక్టర్‌
భారతీయ సినీ ప్రపంచంలో వర్ధమాన తార అనన్య పాండే. పెద్ద స్క్రీన్‌తో పాటు ఓటీటీ లోనూ తన అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేసుకున్నారు. గెహ్రైయాన్‌, ఖో గయే హమ్‌ కహాన్‌, సీటీఆర్‌ ఎల్‌ వంటి చిత్రాలలో పట్టణ జీవితం, సాంకేతికత వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనే యువతిగా ఆమె నిత్యం ప్రేక్షకులతో కనెక్ట్‌ అయ్యి ఉన్నారు. ముఖ్యంగా సైబర్‌ బెదిరింపుల గురించి యువతలో అవగాహన కల్పించేందుకు పాండే సో పాజిటివ్‌ అనే డిజిటల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ప్రచారాన్ని కూడా ఈమె ప్రారంభించారు.
కృతి సనన్‌, యాక్టర్‌
2023లో కృతి సనన్‌ మిమీలో సరోగసి పాత్రను పోషించినందుకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అలాగే హార్రర్‌ కామెడీ భేదియా, హీస్ట్‌ ఫిల్మ్‌ క్రూ వంటి విభిన్న పాత్రలతో కళాకారిణిగా కనిపించి తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సనన్‌ 2023లో తన ప్రొడక్షన్‌ హౌస్‌ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌, ప్రీమియం స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ హైఫెన్‌ని ప్రారంభించి తన నైపుణ్యాన్ని మరింత విస్తరించుకున్నారు. ఇటీవలె నెట్‌ఫ్లిక్స్‌లో దో పట్టీతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.