ప్రస్తుత రోజుల్లో అత్యధిక శాతం కుర్చీలకు అంటి పెట్టుకునే ఉద్యోగాలే. సాఫ్ట్‌వేర్, ఇతర వర్క్ ఫ్రం హౌం ఉద్యోగాలు కావడం.. పైగా మహిళలకు శారీరక శ్రమ లేకపోవడం, సరైన సమయానికి ఆహారం ఆందకపోవడంతో వయసుతో సంబంధం లేకుండా చాలా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా యుక్తవయసు వారికి అధిక బరువుతో అనేక సమస్యలు వస్తున్నాయి. వ్యాయామం లేక ఆరోగ్యలపై చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రుల చుట్టూ తిరగక తప్పడంలేదు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గి చాలా వ్యాధులకు దూరంగా వుండొచ్చంటున్నారు నిపుణులు.
యుక్త వయసు నుంచి వృద్ధుల వరకు అందరూ రోజూ ఏదో ఒక సమయంలో వీలు కల్పించుకుని అరగంట నుంచి గంట వరకూ వ్యాయామం చేయాలంటున్నారు. అంటే ఒంటికి చెమట పట్టేలా… శ్రమిస్తే ఏ వ్యాధులు దరిచేరవు అంటున్నారు.
మహిళలు వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో చాలా మార్పుల నేపథ్యంలో బరువుతో పాటు వారికి పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడమే కాదు.. కొన్ని పోషక పదార్థాలను కూడా రోజూ తీసుకోవాలంటున్నారు నిపుణులు.