టీపీటీఎఫ్  విద్యా మహాసభలను విజయవంతం చేయండి

– అధ్యక్షులు టీపీటీఎఫ్  నిజాంబాద్ వెనిగళ్ళ సురేష్ 
నవతెలంగాణ –  కంటేశ్వర్
ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరిగే టి పి టి ఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహా సభలను విజయవంతం చేయలని జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్  ఉపాధ్యాయులను కోరారు.ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలకు జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, విద్యాభిమానులు, విద్యావేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 1944 నుండి ఫెడరేషన్ విద్యావ్యాప్తికి ఉపాద్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. విద్యా సంబంధ కార్యక్రమాలపై  అనేక చర్చలు, తీర్మానాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం,  ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను, ఉపాధ్యాయుల సంక్షేమంపై చర్చ ఉంటుందన్నారు. ఈ సభలలో  డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు,మేధావులైన ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ హరగోపాల్, బుర్ర రమేష్, ప్రొఫెసర్ కాశీం, వేణుగోపాల్,ఏ నరసింహారెడ్డి,  విమలక్క, పిడబ్ల్యుడి సంధ్య తోపాటు అనేకమంది  మేధావులు విద్యావేత్తలు ఉపాధ్యాయులు పాల్గొంటారని, కావున జిల్లాలోని ఉపాధ్యాయులు మేధావులు, విద్యావేత్తలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
 దీనిలో అరవింద్ చందర్, మల్లేశం, గోపి,లింగయ్య గంగా ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.