
నేడు తుంగతుర్తి మండల కేంద్రంలో సిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించే టీయూడబ్ల్యూజే-ఐజేయు జిల్లా సర్వసభ్య సమావేశాలను జయప్రదం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తరలిరావాలని టీయూడబ్ల్యూజే-ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి బంటు కృష్ణ కోరారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అలాగే టీయూడబ్ల్యూజే-ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ జాతీయ నాయకులు కొంజేటి సత్యనారాయణ తో పాటు స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు,మాజీ మంత్రులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ,మండల శాఖ జర్నలిస్టులు వర్దెళ్లి వీరమల్లు,పూసపెల్లి యాదగిరి,కోదాటి విక్రమ్,లింగమూర్తి,భూపతి సైదులు, ఎండి నజీర్ తదితరులు పాల్గొన్నారు.