హెచ్‌డీఎఫ్‌సీ సేవలను సధ్వినియోగం చేసుకోవాలి

హెచ్‌డీఎఫ్‌సీ సేవలను సధ్వినియోగం చేసుకోవాలి– ఎస్టీపీపీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసులు
నవతెలంగాణ-జైపూర్‌
ఎస్టీపీపీ ఒప్పంద కార్మికులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వార వేతనలు అకౌంట్‌ పొందివుండటం ద్వార సదరు బ్యాంకు వారు ఖాతాదారులకు అందిస్తున్న ప్రయోజనాలు పొందాలని ఎస్టీపీపీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసులు అన్నారు. సింగరేణి డైరెక్టర్‌(ఫా) ఆదేశాల మేరకు మంగళవారం ఎస్టీపీపీ కాన్ఫెరెన్స్‌ హాలులో సింగరేణి-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వారి మధ్య జరిగిన అవగాహణ ఒప్పందంలో ప్రమాధ భీమాపై అవగాహణ కల్పించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా కలిగివున్న కార్మికులకు ప్రమాదంలో మృతి చెందితే రూ. 20 లక్షల ప్రమాద భీమా అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కార్మికుడు డెబిట్‌ కార్డు నెలలో ఒక సారి ఉపయోగించినా రూ. 10 లక్షల అదనపు భీమా ప్రయోజనం పొందడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కార్మికుడు ప్రమాదంలో మృతి చెందిన సంధర్భంలో కుటుంబంలో 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉండి చదువుకున్నట్లయితే వారికి రూ.4 లక్షల ఆర్థిక సాయం హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తుందని తెలిపారు. ప్రమాదంలో అంగవైకల్యం పొందిన సంధర్భంలో రూ. 20 లక్షల భీమా సదూపాయం అందుతుందని కార్మికుడు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నప్పుడు రోజుకు రూ.1000 చొప్పున 15 రోజుల పాటు ఆర్థిక సహాయం, ఏడాదిలో గరిష్టంగా రూ. 15 వేల ఆర్థిక సాయం పొందవచ్చునని తెలిపారు. ఈ మేరకు సింగరేణి, హెచ్‌డీఎఫ్‌సీ మధ్య సరిగిన అవగాహణ ఒప్పందం ద్వార కార్మికులకు జరుగు ప్రయోజనాన్ని జీఎం శ్రీనివాసులు కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సివిల్‌ కేఎస్‌ఎన్‌ ప్రసాద్‌, పర్సనల్‌ మేనేజర్‌ రామ శాస్త్రీ, ఎస్‌ఓటూ జీఎం వెంకటయ్య, ఎస్‌ఓటు ఈడీ ప్రభాకర్‌ పాల్గొన్నారు.