ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ని హైదరాబాద్ లోని తన నివాసంలో జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యం.డి.సలీం కలిసి ముస్లింలకు పవిత్రమైన మక్కా నుండి తీసుకొని వచ్చిన జం జం వాటర్ తో పాటు ఖర్జూర ప్రసాదం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు…ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ మక్కా అల్లా దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసుబోజుల వెంకన్న, సలీం పాషా, ఎగ్గని శ్రీనివాస్, రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యు ఐ ఉపాధ్యక్షు ఇమ్రాన్, మహేందర్ ఉన్నారు .