– కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, చీమల జంగయ్యయాదవ్
నవతెలంగాణ-మంచాల
ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజక ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజక నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, చీమల జంగయ్య యాదవ్ ప్రజలను కోరారు. మంగళవారం మండల పరిధిలోని చెన్నరెడ్డి గూడ గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15ఏండ్లుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుక బడిపోయిందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తేవడం లో, నియోజకవర్గ అభివృద్ధి చేయ డంలో కూడా విఫలమై య్యారని విమర్శించారు. ఓటర్లు అందరూ చేయ్యి గుర్తుకు ఓటేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఇబ్రహీం పట్నం నియోజక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెనీగా వెంకటేష్, ముచ్చర్ల వెంకటేష్ యాదవ్, బానవత్ శ్రీను నాయక్, పగ డాల శ్రీశైలం, గ్యార బుగ్గ రాములు తదితరులు ఉన్నారు.