
నవతెలంగాణ – కంఠేశ్వర్
దళిత నాయకులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ మేయర్ భర్త చంద్రశేఖర్ పై హత్యయత్నం జరగగా ఈ విషయమై మంగళవారం పృడన్స్ హాస్పిటల్ లో దళిత నాయకులతో కలిసి పరామర్శించారు. దళిత నాయకుడిపై హత్యయత్నం చేయటం చాలా బాధాకరమని దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్న దుండగులను కఠినంగా శిక్షించి సమగ్ర విచారణ చేసి ఈ దాడి వెనక ఉన్న వారందరిని కఠినంగా శిక్షచాలని కోరుతూ ఇంచార్జి కమీషనర్ అఫ్ పోలీస్ సింధు శర్మ ని కలిసి పిర్యాదు చేశారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షములో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర మాలమహానాడు నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, ఎడ్ల నాగరాజు, అనాంపల్లి ఎల్లం, అలుక కిషన్, అంగరి ప్రదీప్, నీలగిరి రాజు, నాంది వినయ్, స్వామి దాస్, సుశీల్ కుమార్, దేవిదాస్, బాలారాజు తదితరులు పాల్గొన్నారు.