
మండలంలోని కూరెళ్ళ గ్రామంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, జిల్లా ఉపాధ్యాక్షుడు తలారి నర్సయ్య, ఆరె కిషోర్ ఆధ్వర్యంలో గ్రామశాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పంగ మల్లిఖార్జున్, ప్రధాన కార్యదర్శిగా పంగ రాజు, కోశాధికారిగా బందెల మల్లేశం, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. మండల కమిటీ సభ్యులుగా గద్దల రమేష్, పంగ రాజ్‌కుమార్, చింతల హరికృష్ణలను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని గ్రామాలలో కమిటీ వేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తామన్నారు. ఎస్సీ కులాల జాబితాలో అన్ని వర్గాలు కలిసి ఉండి తమ హక్కులు సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గద్దల వెంకటయ్య, ఉపాధ్యాక్షుడు మాశం కనకయ్య, బందెల రమేష్, సంయుక్త కార్యదర్శి దొంతి కిషన్, కోశాధికారి బందెల మల్లేశం, ప్రచార కార్యదర్శులు పంగ అజయ్, పంగ శేఖర్, అంజయ్య, రాజయ్య, చింతల హరికృష్ణ, కనకయ్య, స్వామి, రాజు, అశోక్, సురేష్, నరేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.