నవతెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మాల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని ఆదివారం వారి మద్దతు కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..మాలల్లో ఐక్యత రావాలి. చదువుతోనే గుర్తింపు ఉంటుందన్నారు. నిజానికి మాల ఉపకులాలు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని పూర్తి అన్యాయం జరిగిందన్నారు. డాక్టర్ అంబేద్కర్ అంటరాని జాతులన్నీ ఐక్యతతో ఉండాలన్నరు ఎస్సి కులాలు విచ్చిన్నం కాకూడదని అన్నారు. దళిత జాతి రాజకీయ అధికారంలోకి రాకుండా పూర్తిగా బానిసలు గా ఉంచాలని అనుకుంటున్నా మనువాదుల కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకు ను రాబట్టుకోవడం కోసం బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని కుట్రలు చేసినా దళితులు కాంగ్రెస్ ఎంబడి ఉంటారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి తెలియని మూర్కుడు నరేంద్ర మోడీ అయినందునే, ఎస్సీల భవిష్యత్ తో రాజకీయ క్రీడలు బీజేపీ, ఆడుతుంది అని, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి నీతి నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్న మూర్ఖుడు నరేంద్ర మోడీ అని తెలియజేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నిపింది ఇందిర గాంధీనే అని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే బంధువులకే అన్ని పథకాలు అమలు చేశారని, దళిత బంధు పేరిట దగా చేసేందకు కుట్రలు పన్నారు అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడ బిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, నగదుతో పాటుగా తులం బంగారం. ఒక్కో కాలనీకి మూడు నుంచి 500 వరకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పైసా పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడుతుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు అమలైతే పేద కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. అబద్దాలకోరు కేసీఆర్ను అసలు నమ్మవద్దు దళితునికి సీఎం చేస్తున్నాడు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.