నవతెలంగాణ-హైదరాబాద్
డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రూపొందించిన పోస్టర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే డా.జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ “మాలల అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం మాలలను ఐక్యం చేయడం కోసం డిసెంబర్ 1 న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని, మాల జాతి జాగృతం కోసమే నిర్వహిస్తున్నామని, తెలంగాణ విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి హైదరాబాద్ నగరాన్ని నీలిమయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంసా రాష్ట్ర కార్యదర్శి నీరడి సూర్యం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, కన్వీనర్ డి. సర్వయ్య, ఓయూ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాం చందర్, సీనియర్ జర్నలిస్టు ఆస శ్రీరాములు, విద్యార్థి నాయకులు చిక్కుడు వెంకట్, సైదులు, వీరస్వామి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు