గిరిజన గ్రామాల్లో మలేరియా నిర్ధారణ శిబిరం: డాక్టర్ లు రాందాస్, మధుళిక 

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని వినాయక పురం,గుమ్మడవల్లి ప్రాధమిక కేంద్రాల పరిధిలో పలు గ్రామాల్లో శనివారం మలేరియా నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయా పిహెచ్సీ ల వైద్యాధికారులు డాక్టర్స్ రాందాస్,మధుళికలు తెలిపారు. రెండు ఆసుపత్రుల వైద్యారోగ్య సిబ్బంది సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో  6 బృందాలు 3 గ్రామాల్లో దురద పాడు,దిబ్బ గూడెం,కొత్త కావడి గుండ్లు లలో 1245 మందికి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరి కి మలేరియా నిర్ధారణ కాలేదు. అనంతం వైద్యులు మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ను జ్వరం వచ్చే అవకాశం ఉందని,వేడి గాలులు,వడగాల్పులు అధికా ఉన్న పరిస్థితుల్లో ఉదయం 10 లోపు,సాయంత్రం 4 తర్వాతనే ప్రజలు వారి పనులు నిర్వహించుకోవాలని,అధిక మొత్తం లో నీటిని తీసుకోవాలి నీ సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రాజు,హెచ్ ఎస్ శ్రీనివాస్,ఎంటి ఎస్ విజయారెడ్డి,హెచ్ ఏ లు రవి,ప్రసాద్,సతీష్,గోపాల్,సత్యనారాయణ,పి.వెంకటేశ్వర్లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.