
నవతెలంగాణ-గోవిందరావుపేట
వర్షాకాలంలో మలేరియా వ్యాప్తి కాకుండా నివారించుకోవాలని జోనల్ మలేరియా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమక ఆరోగ్య కేంద్రాన్ని మలేరియా నివారణకు సంబంధించిన మెడికల్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వల్ల మలేరియా వ్యాప్తి కాకుండా ప్రజలు జాగ్రత్తలుగా పాటించాలని అన్నారు. చలి జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే మలేరియా పరీక్షలు చేయించుకొని నిర్ధారణ అయితే వెంటనే సంబంధిత మందులను వాడి తగ్గించుకోవాలని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలుకేసుల వివరాలను ల్యాబ్ మరియు రక్త నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య సబ్ యూనిట్ ఆఫీసర్ సోమేశ్వర్ స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.