మలావత్ రమేష్ నాయక్ కు బయోటెక్నాలజీలో పి హెచ్ డి ప్రధానం…

నవతెలంగాణ-డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ లోని బయోటెక్నాలజీ  విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి మాలవత్ రమేష్ నాయక్ కు శుక్రవారం పిహెచ్డి పట్టా ప్రధానం చేశారు.మలావత్ రమేష్ నాయక్  కాంబినేటోరియల్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ రూట్ నాట్ నెమటోడ్ ఇన్ఫేస్టేషన్ ఇన్ టర్మరిక్ అనే అంశంపై డాక్టర్.ఐలేని మహేందర్  పర్యవేక్షణలో ఈ పరిశోధన నిర్వహించారు.ఈ కార్యక్రమ ఫైనల్ వైవా కు ఎక్స్టర్నల్ ఎగ్జామినేర్గా హాజరైన కర్ణాటక హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ హరీష్ చంద్ర ఆర్ పరిశోధన సమాచారాన్ని రాబట్టి పిహెచ్డి పట్టా ప్రధానం చేశారు.బయటెక్నాలజీవి విభాగాధిపతి  డాక్టర్. జవేరియా ఉజ్మ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రిన్సిపాల్ మరియు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ సిహెచ్.అరతి, కంట్రోలర్ ప్రొఫెసర్ అరుణ,డాక్టర్. కిరణ్మయి, డాక్టర్ ప్రసన్న శీలా, పి హెచ్ డి పరిశోధక, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.