ప్రభుత్వం సోమవారం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష పేపర్లలో మల్హర్ మండలంలోని రెండు దేశవ్యాప్తంగా మార్మోగిన సంచలన సంఘటనలైన పాత మండలంగా ఉన్న నాటి తాడిచెర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా కొనసాగిన స్వర్గీయ బెల్లంకొండ మల్హర్ రావు మావోయిస్టుల చేతిలో హత్య (1989)లో జరిగింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మల్హర్ రావు ప్రజా నాయకుడుగా ప్రజల తలలో నాలుకలా ఉంటూ గొప్ప పెరు తెచ్చుకున్నాడు.ఆయన ఎంపిపిగా రహదారులు, విద్యుత్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇప్పటి వరకు ఆయన బ్రతికి ఉంటే మంత్రిస్తాయిలో ఉండేవారని పలువురు ఇప్పటికి అంటూ ఉంటారు.1964 మల్లారం గ్రామంలో జన్మించి 1989 లో మావోయిస్టుల చేతిలో హతం అయ్యారు.
కొయ్యుర్ ఎదురు కాల్పులు..
గ్రూపు-2లో వచ్చిన మరో కొచ్చన్ ఈ ఎన్కౌoటర్ 02-12- 1999లో అంటే 25 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ ఎదురు కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భారీ ఎన్కౌoటర్ మావోయిస్టు అగ్రనేతలు నల్ల అదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్,పశువుల కాపరి లక్ష్మీ రాజాం అమరులైయ్యారు. వీరికి గుర్తుగా పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలో బేగంపేట గ్రామంలో 52 అడుగుల స్తూపం ఓకేరాత్రిలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టులు నిర్మించారు.అగ్ర నేతల ఆశయ సాధనలో ప్రతియేటా డిసెంబర్ 1 నుంచి 8 వరకు పిఏ జిఎల్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
