కొమురంభీం స్పూర్తితోనే మల్హర్‌రావు అభివృద్దికి బాటలు..

Malhar Rao's path to development is only with the spirit of Komurambhim..– ఆయన ఆకాంక్ష.. ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలే
– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు
కొమురం భీం స్ఫూర్తితో మండల అభివృధ్ది ప్రధాత స్వర్గీయ బెల్లంకొండ మల్హర్‌రావుని మంథని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి పుట్ట మదుకర్ అన్నారు.మండల మాజీ ఎంపీపీ బెల్లంకొండ మల్హర్ రావు 60వ జయంతి సందర్బంగా మండలంలోని కొయ్యూర్‌ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన మల్హర్‌ రావు విగ్రహానిని పుట్ట పూలమాల వేసి ఘన నివాళర్పించారు.ఈసందర్బంగా మాట్లాడారు  ఆనాడు సర్పంచ్‌గా మల్హర్‌రావు మండల అభివృధ్దికి బీజం వేశారని గుర్తు చేశారు.నాగులమ్మ ఆలయం నుంచి మల్లారం తాడిచర్ల వరకు రోడ్లు నిర్మాణం కోసం అధికారులను ఎదిరించారని, ప్రజల అవసరాల కోసం ఎవరినైనా ఎదిరించవచ్చని చెప్పిన గొప్ప వ్యక్తిన్నారు. జల్‌ జంగల్‌ జమీన్‌ అనే నినాదంతో పోరాటం చేసిన కొమురం భీం స్పూర్తితో మల్హర్‌రావు ఈ ప్రాంత అభివృధ్దికి ఎనలేని కృషి చేశారన్నారు. అడవులు అడ్గంగా ఉన్నా రోడ్ల నిర్మాణం చేయించిన గొప్ప నాయకుడని కొనియాడారు.ఆ తర్వాత జరిగిన అభివృద్ది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే జరిగిందన్నారు. మల్హర్‌రావు ఆలోచనలు, ఆకాంక్షను, ఆశయాలను మండల ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల కోసం ఆనాడు మల్హర్‌రావు పరితపించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల కోసం పుట్టిన వాళ్లు ఏ విధంగా ఉంటారో, ప్రజలను వాడుకునే వాళ్లు ఏ విధంగా ఉంటున్నారో చాటిచెప్పే  రోజులు చీకట్లోనే ఉంటామని ఆయన వివరించారు. మల్హర్‌రావు ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు,మాజీ పిఏసిఎస్ చైర్మన్ రామారావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, కొయ్యుర్ తాజామాజి సర్పంచ్ సిద్ధి  లింగమూర్తి,మాజీ ఎంపిటిసి రావుల కల్పన మొగిలి, మాజీ కొప్సన్ ఆయూబ్ ఖాన్,రామన్న యాదవ్ తోపాటు బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.