ఆదిలాబాద్ లో ఫిబ్రవరి 9న మాలి మహా సంఘం ఎన్నికలు..

Mali Maha Sangam elections in Adilabad on February 9.– రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఫిబ్రవరి 9న మాలి మహా సంఘ ఎన్నికలను విజయవంతం చేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే తెలిపారు. బుధవారం పట్టణంలోని పూలే విశ్రాంతి భవనంలో సంఘ సభ్యులతో కలిసి మాట్లాడుతూ.. పూలే ఆశయ సాధన, మాలిల హక్కులు, సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర శాఖ, ఉమ్మడి జిల్లాలోని జిల్లా కమిటీలను, మహిళా సంఘం, యువజన సంఘ కమిటీలను మాలి మహా సంఘం జాతీయ అధ్యక్షులు విలాసరావు పాటీల్ సమక్షంలో  ఫిబ్రవరి 9న ఎన్నుకొనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలి క్రియాశీల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 24 సంవత్సరాలుగా మాలీలకు సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు చేశామని, దాని ఫలితంగానే మాలిల ఎస్టీ హోదా కల్పన అంశంపై చర్చ జరిగి అసెంబ్లీలో బిల్లు పాసై కేంద్రానికి పంపడం జరిగిందని తెలిపారు. త్వరలోనే బిల్లు ఆమోదం కోసం రేవంత్ రెడ్డిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి కోరన్నట్లు తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల ఆశయ సాధన కోసం, మాలి కులస్తుల సంక్షేమ కోసం పాటుపడాలనుకునే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల మలిసంఘ క్రియాశీల కార్యకర్తలు ఫిబ్రవరి 9న ఆదివారం  జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల యాదవ సంఘం భవనంలో జరిగే ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాలి మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శెండే, కోశాధికారి సతీష్ గురునూలే, మాలీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ ఉమేష్ రావు ఢోలే, జిల్లా కార్యవర్గ సభ్యులు సుభాష్ శేండే, శీను ఆచారి, అనిల్ కోట్రంగే, డాక్టర్ రమేష్, భాస్కర్ ప్రధాన్, ఉత్తం పెట్టుకులే పాల్గొన్నారు.