నవతెలంగాణ – గోవిందరావుపేట
గ్రామీణ వైద్యులపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలు ఆపాలని దసరా గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామపంచాయతీ కార్యాలయంలో పసర గ్రామీణ వైద్యుల సంఘం సమావేశం అయింది. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులు మాట్లాడుతూ పసర గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రధమ చికిత్సను నమ్ముకొని నిరుద్యోగంతో ప్రజలకు సేవలను అందజేస్తూ జీవనం గడుపుతున్నాము కొందరు గిట్టని వ్యక్తులు మాపై దుష్ప్రచారాలు చేస్తూ మా జీవన ఉపాధి అనేది లేకుండా చేయడానికి అధికారులకు మాపై తప్పుడు సమాచారం ఇస్తూ మాపై దాడులు చేపిస్తున్నారు. ఈ ప్రధమ చికిత్స వృత్తిని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా జీవనం గడుపుతూ రాత్రి అనకా పగలు అనక ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న మాకు అధికారులు దయ తలచి మా వృత్తిని మమ్ములను చేసుకొని ఇవ్వండి అని పస్ర గ్రామీణ వైద్యులు కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పసర గ్రామీణ వైద్యులు బుర్రి శ్యాంబాబు, ఎండి అజారుద్దీన్ ఏం ఫణీంద్ర చారి వెంకటేశ్వరరావు ఆర్ వెంకన్న డి నాగరాజు ఇన్ విజయ్ ఎస్ కుమారస్వామి పి వెంకన్న ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.