మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షునిగా మాలీపటేల్ సంజయ్ నియామాకం

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షునిగా వజ్రఖండి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్ ను రాష్ట్ర పీసీసీ అద్యక్షుల సమక్షంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ కోరిక మేరకు నియేాజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోవడంతో నియేాజక  వర్గంలోని కాంగ్రస్ శ్రేణులు సంభరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ పార్టీ అధ్యక్షున్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా  రాష్ట్ర కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ గౌడ్ గారు జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నూతన అధ్యక్షులను నియమించిన సందర్బంగా నూతనంగా ఎన్నికైన జుక్కల్ మండల అధ్యక్షులు సంజయ్ పటేల్ గారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కౌలాస్ గ్రామానికి చెందిన విండో డైరెక్టర్ నాయకురాలు అనితా సింగ్, హన్మగౌడ్ శనివారం నాడు మండల పార్టీ కొత్త అద్యక్షునికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  సన్మానించారు. కార్యక్రమంలో యాదారావ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.