మండలంలోని బషీరాబాద్ గ్రామ శివారులోని దూల గుట్ట పై వెలిసిన మల్లన్న స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల మాల ధారణతో మల్లన్న ఉత్సవాలు ప్రారంభమైనట్లు యాదవ సంఘం అధ్యక్షులుగణేష్ తెలిపారు.మల్లన్న స్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి పల్లికి సేవ ఊరేగింపు, శనివారం రోజున స్వామి వారికి మైలేలు తీయడం, ఆదివారం గంగా నీళ్లు, స్వామి వారినీ ఎదుర్కోవడం, సోమవారం బోనాలు ఊరేగింపు, మల్లన్న స్వామి వారి కళ్యాణం, అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.మంగళ వారం రోజున ఎల్లమ్మ పట్నాలు, బోనాలు, బుధవారం స్వామి వారికి నాగవెల్లి, అగ్ని గుండాలు మొదలైన కార్యక్రమాలు ఉంటాయనిఅధ్యక్షులు గణేష్ వివరించారు. మల్లన్న స్వామి ఉత్సవాలలో గ్రామస్తుల తో పాటు ఇతర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి దేవన్న, హరీష్, బూమన్న, రాజు, అబ్బాస్, మహేష్, భోగాన్న, సుబ్బు, చిన్నయ్య, కుల పెద్దలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.