సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన మల్లన్నసాగర్ బాధితులు


నవతెలంగాణ-తొగుట సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ని మల్లన్న సాగర్ ముంపు బాధితులు కలిసారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముంపు గ్రామాలైన మల్లన్నసాగర్ ముంపు బాధి తులు సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ని కలిసి ప్రాజెక్టు నిర్మాణ సమయం లో జరిగిన సమస్యల గురించి వివరించారు. గతం లో ఉన్న ప్రభుత్వం ప్రాజెక్టుకు నిర్మాణ సమయం లో మా గ్రామాలను మల్లన్న సాగర్ నిర్మాణం కోసం భూసేకరణ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం భూముల పై రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క రైతు రుణం మాపి కాలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ చేసిందని గుర్తు చేశారు. అప్పటి వరకు ఉన్న రైతుల రుణాలను ఏఒక్క రైతుకు మాఫీ చేయలేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు గ్రామాల పై దయతల చి ఎలాంటి షరతులు లేకుండా భూ నిర్వాసిత రైతులకు మాఫీ చేయాలని కోరారు. ఈ విషయం పై స్పందించి వేం నరేందర్ రెడ్డి ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు పాల్గొన్నారు.