మల్లయోదుడికి వెండి కడియం బహుకరణ

నవతెలంగాణ – జుక్కల్ :  మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామములో ఎల్ల అమావాస్య రైతు పండుగ సంధర్భంగా ఖండోబా జాతరతో పాటు గ్రామస్తులు కుస్తీ పోటీలు పూర్వం నుండి   నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన కుస్తీపోటీల కార్యక్రమంలో  మహరాష్ట్ర, కర్ణాటకల నుండి తుస్తీ ల పోటీలో, తిలకించేందుకు బారీగా పాల్గోన్నారు. స్థానికి సర్పంచ్ అస్పత్ వార్ నినోద్   ప్రత్యేకంగా భూమి పూజ నిర్వహించి కుస్తీ పోటీలు ప్రారంబించారు. గెలుపొందిన  వారికి పదకొండు తులాల వెండి కడియం యువ నాయకుడు అస్పత్ వార్ అరుణ్ గెలుపొందిన వ్సక్తికి భహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు.