హుడా పాఠశాలకు ‘మల్లేష సార్‌’ సేవలు మరువలేం

Navatelangana,Telangana,Telugu News, Telangana News,Rangareddy– పాఠశాల గౌరవ అధ్యక్షులు ఒక్కంటి జనార్ధన్‌
– బదిలీపై వెళ్లిన హెచ్‌ఎం మల్లేషకు ఘన సన్మానం
నవతెలంగాణ-శంషాబాద్‌
ఉపాధ్యాయుల కషి వల్లనే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పాఠశాల అయినా ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చన్న దానికి నిలువెత్తు నిదర్శనం శంషాబాద్‌ హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఎ.మల్లేష ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారని ఆ పాఠశాల గౌరవ అధ్యక్షులు వక్కంటి జనార్ధన్‌ అన్నారు. మల్లేషా సార్‌ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా పాఠశాల హెచ్‌ఎం మల్లేష బదిలీపై వెళ్లారు. సోమవారం పాఠశాల హెచ్‌ఎంగా బదిలీపై వచ్చిన పాఠశాల నూతన హెచ్‌ఎం ప్లేస్సిస్‌కు ఆయన చార్జి ఇచ్చారు. పాఠశాల గౌరవ అధ్యక్షులు జనార్ధన్‌ ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్కంటి జనార్దన్‌ మాట్లాడుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ సమయంలో కోల్పోయిన పాఠశాలను ఎంతో కష్టనష్టాలకు ఓర్చుకొని తిరిగి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పాఠశాల అధ్వాన స్థితిలో ఉన్న సమయంలో జూకల్‌ గ్రామం నుంచి బదిలీపై వచ్చిన విశేష కషితో పాఠశాల రూప రేఖలను మార్చాలని కొనియాడారు. ఆయన వచ్చిన వెంటనే పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. చేసే ప్రతి పనికి తన సహకారం అందించడంతో రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా అవార్డులు పొందిందన్నారు పాఠశాల నిర్వహణలో విద్యాబోధన, పరిసరాల పరిశుభ్రత హరితహారం, శానిటేషన్‌, మధ్యాహ్న భోజనం వంటి వాటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. పాఠశాలలో ప్రస్తుత పరిస్థితులు అద్వానంగా మారడం ఆందోళన కలిగిస్తుందన్నారు రాష్ట్రస్థాయి అవార్డు పొందిన పాఠశాల నిర్లక్ష్యానికి గురి కావద్దని ,అలసత్వం ప్రదర్శించద్దని అన్నారు.
ఇష్టపడి పాఠశాలను తీర్చిదిద్దాను : ఎ. మల్లేష
హూడా కాలనీ పాఠశాలలో 90 శాతం విద్యార్థులు వలస కార్మికుల కుటుంబాలకు చెందినవారని తెలిపారు. తాను పాఠశాలకు వచ్చిన మొదట్లో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా అధికంగా సమయాన్ని కేటాయించి కావలసిన సౌకర్యాలు కల్పించేందుకు కషి చేశానన్నారు. పాఠశాల అభివద్ధి తన కషితో పాటు పాఠశాల గౌరవ అధ్యక్షులు వక్కంటి జనార్ధన్‌ నిస్వార్థ సహకారం వల్ల సాధ్యమైందన్నారు. తాను రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న హుడా కాలనీ పాఠశాల అభివద్ధిని ఏ మాత్రం లోటు లేకుండా కొనసాగించాలని సూచించారు. విద్యా బోధనలో పాఠశాల నిర్వహణ అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమన్నారు. పాఠశాలకు వచ్చిన పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత కొత్తగా వచ్చిన వారిపై ఉందని అన్నారు.