నవతెలంగాణ, జోగిపేట
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోగిపేట పట్టణానికి చెందిన తాళ్ల మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇటీవల జరిగిన సంఘం జిల్లా 3వ మహాసభల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటీలో అందోల్ డివిజన్ నుండి ఉపాధ్యక్షలుగా మన్నే పోచయ్య, సుభాష్ నాయక్, సహాయ కార్యదర్శులు గా సాయమ్మ, రాంచందర్, జిల్లా కమిటీ సభ్యులుగా రమాదేవి, నాగయ్య, కృపవరం, శ్రీనివాస్ గౌడ్, ఖలీల్ మియా ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ
జిల్లాలో వికలాంగులు ఎదురుకుంటున్న 23రకాల సమస్యలపై తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ తీర్మానల అమలు కోసం ఉద్యమం చేస్తానని తెలిపారు. పెన్షన్ పెంపు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్, స్వయం ఉపాధి రుణాలు, చట్టాల అమలుకోసం పోరాటాలు చేస్తామని అన్నారు.హక్కుల సాధన కోసం వికలాంగులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.