
నవతెలంగాణ – నూతనకల్
ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తు మతాన్ని ప్రేరేపిస్తూ మత రాజకీయం చేసే మతోన్మాత బీజేపీని ఓడించి కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే భువనగిరి పార్లమెంట్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడుతూ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విధానాలు కొనసాగాలంటే పార్లమెంటులో ప్రశ్నించే గొంతు సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించి పార్లమెంటు పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరుకు ఉందని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) పార్టీ పేదల కష్టజీవుల తరఫున నీతి నిజాయితీతో పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి నాటి నుండి నేటి వరకు సీపీఐ(ఎం) పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ ప్రైవేటీకరణ విధానాన్ని అనుసరిస్తూ కారు చౌకగా బడా కార్పోరేట్లకు దేశ సంపదను అప్పన్నంగా కట్టబెడుతున్నాయని అన్నారు. ఒకవైపు అంబానీ ఆదానిలకు ప్రభుత్వ రంగ సంస్థలు కట్టబడుతూ మతాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు. గత ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని డీజిల్, పెట్రోల్ ,వంట గ్యాస్, నిత్యవసర ధరలు విచ్చలవిడిగా పెంచి పేదలను ఇబ్బందులను ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఓడించలని కోరారు సుత్తి కొడవలి నక్షత్ర గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నరసింహారావు నాయకులు గజ్జల శ్రీనివాసరెడ్డి బానాల విజయ రెడ్డి బాలకృష్ణ బత్తుల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.