కార్మిక కర్షకుల పక్షాన పోరాడే జహంగీర్ ను గెలిపించండి: మల్లు నాగార్జున రెడ్డి

నవతెలంగాణ – నూతనకల్
కార్మిక, కర్షకుల పక్షాన నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి కామ్రేడ్ ఎండి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మొత్తం దివాలా తీయించి కార్పొరేట్ల ను అందరం ఎక్కించారనీ విమర్శించారు. గత ఎన్నికల్లో విదేశాల్లో దాచుకున్నటువంటి డబ్బును ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున ఆకౌంట్లో వేస్తానని మాటలు చెప్పి మోసం చేసిందని అన్నారు. కులం, మతం ,దేవుని పేరుతో మళ్లీ అధికారంలో రావడం కోసం ప్రజలను రెచ్చగొడుతూ విభజించి పాలించాలని చూస్తున్నారనీ అన్నారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని, బిఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఓడించి ప్రజల మనిషి సీపీఐ(ఎం) బోనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడ్ జాంగిర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు దండా వెంక రెడ్డి, వేల్పుల వెంకన్న ఆత్మకూరు మండల కార్యదర్శి ఆవిరి అప్పయ్య , బెల్లంకొండ వెంకటేశ్వర్లు నూకలగిరి రెడ్డి సానబోయిన ఉపేందర్ తొండల నారాయణ డివైఎఫ్ఐ నాయకులు నాగరాజు ,లింగంపల్లి గ్రామానికి చెందిన జోజి లింగయ్య బోయిన మల్లయ్య ,నాగులు, కొరివి నందమ్మ కన్నెగంటి ఎల్లయ్య మాదాసు వెంకన్న దేశ పంగు వీరయ్య మేకల మధు సంతోష్ పాల్గొన్నారు.