ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మల్లు రవి 

– మద్దిమడుగు  ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే 
నవతెలంగాణ – అచ్చంపేట
పదర మండలం మద్దిమడుగు పుణ్యక్షేత్రమైన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిలు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మద్దిమడుగు , మారేడుకు ఇప్పలపల్లి, చెన్నంపల్లి, చిట్లంగుంట్ల గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన నల్లమల్ల ప్రజలకు చాలా సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి డాక్టర్ మల్లు రవి నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు.  కావున వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో మెజార్టీ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేయాలని పిలుపునిచ్చారు. మల్లు రవి గెలుపుతో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నిజాంపేట నియోజకవర్గం అని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్లు రవి గెలుపుతో నదిపై బ్రిడ్జ్, మద్దిమడుగు ఇప్పలపల్లి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సాగునీరు, త్రాగునీరు సమస్యను,  నెట్వర్క్ సమస్యను గెలిచిన మూడు నెలల్లోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ మల్లు రవి  గెలుపుతో కేంద్రంలో భావి భారత యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానిగా ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడు. నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.