మల్లు రవి గెలుపు.. అభివృద్ధికి మలుపు

– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌
– ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల్లో ఊరూరా ప్రచార ప్రభంజనం
– ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఇన్‌చార్జి ఇందిరా శోభన్‌
– ముమ్మరంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌లో చేరికలు
నవతెలంగాణ-ఆమనగల్‌
డాక్టర్‌ మల్లు రవి గెలుపు అభివృద్ధికి మలుపు అని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పార్లమెంటు ఎన్నికల కదన రంగంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళవారం ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కడ్తాల్‌ మండలంలోని అన్మాస్‌పల్లి, ఆమనగల్‌ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొని మాట్లాడారు. పదేండ్లుగా ఇటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిలేదని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన నిలబడడంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో హామీనిచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలచి డాక్టర్‌ మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రీనివాస్‌ గౌడ్‌ ఓటర్లను వేడుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ ఇన్‌చార్జి ఇందిరా శోభన్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. పిలిస్తే పలికే వ్యక్తిగా మంచి పేరున్న మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఓటర్లకు ఇటీవల రాహుల్‌ గాంధీ ప్రకటించిన ఐదు న్యాయ గ్యారంటీ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్‌, మండల అధ్యక్షులు తెల్గమల్ల జగన్‌, సబావత్‌ బిచ్యా నాయక్‌, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, రాంచందర్‌ నాయక్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కేతావత్‌ హీరాసింగ్‌ నాయక్‌, రాజు, ఎంపీటీసీ నిట్ట మంగమ్మ నారాయణ, మాజీ సర్పంచ్‌ పోతుగంటి శంకర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పోతుగంటి అశోక్‌, సీనియర్‌ నాయకులు గూడూరు భాస్కర్‌ రెడ్డి, అనిల్‌ యాదవ్‌, జగన్‌ యాదవ్‌, ఫనింద్ర గౌడ్‌, తులసిరాం, శ్రీరాములు, అజ్గర్‌ అలి, యాదయ్య, శ్రీను, రాజేష్‌, ఇమ్రాన్‌ బాబా, శ్రీకాంత్‌, వెంకటాపురం శివ, సత్యం, సురేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.