నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
బడుగు జీవుల గొంతుక, సీపీఐ(ఎం) హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మీని గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం కోరారు.సోమవారం స్థానిక అనుములగూడెం లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గతంలో సైకిల్‌యాత్రతో పాటు అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు.స్థానిక సమస్యలపై అవగా హన కలిగి వాటి పరిష్కారం కోసం కషి చేసే మల్లులక్ష్మీ విజయానికి ప్రతిఒక్కరూ చేయూతనందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి నకిరేకంటి శంభయ్య, రేపాకుల వెంకన్న, కుక్కడపు వెంకన్న, గోవిందు, గోవిందమ్మ, సైదమ్మ, కోటయ్య, ఓరుగంటి వెంకటేశ్వర్లు, సాముల నరేందర్‌రెడ్డి తదతరులు పాల్గొన్నారు.